ఈ ఏడాది నీటి కరువు రానివ్వం

ABN , First Publish Date - 2020-10-25T11:17:18+05:30 IST

ఈ ఏడాది నీటి కరువు రానివ్వమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదు కూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రక టించారు.

ఈ ఏడాది నీటి కరువు రానివ్వం

కరకట్టను పరిశీలించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే


బ్రహ్మంగారిమఠం, అక్టోబరు 24: ఈ ఏడాది నీటి కరువు రానివ్వమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదు కూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రక టించారు. బ్రహ్మంసాగర్‌ కరకట్ట లీకేజీ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కరకట్టను పరి శీలించారు. అనంతరం పాత్రికేయు లతో మాట్లాడుతూ తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌ ప్రా జెక్టులో 13 టీఎంసీల నీటిని నిల్వ చేసిన ఘనత 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సాధించారన్నారు. 


ప్రస్తుతం 14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి వైఎస్‌ ఆర్‌ కుమారుడు ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్‌ ఘనత పొందారన్నా రు. దీంతో రాబోయే వేసవిలో బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్న 1.55 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. ప్రజలకు తాగు నీటినిపుష్కలంగా అందిస్తామన్నారు. అనంతరం కట్ట లీకేజీని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలి స్తూ మరమ్మతులను చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం డైరెక్టర్‌ గా ఎంపికైన గొడ్లవీటి సుబ్రహ్మ ణ్యం ఆచారి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆయన తనయుడు నాగిరెడ్డిని సన్మానించారు. 


 కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖ అధికారి ఎస్‌ఈ శారద, మైదు కూరు వైసీపీ ఇన్‌ఛార్జి ఎస్‌.నా గిరెడ్డి, సింగిల్‌విండో ఛైర్మన్‌ సి.నాగేశ్వరరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం డైరెక్టర్‌ గొడ్లవీటి సుబ్రహ్మణ్యం, బి.మఠం మండల ఎంపీపీ అభ్యర్థి సి.వీరనారాయ ణరెడ్డి, కొండా సింగరయ్యస్వామి ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, ఎల్ల టూరు ఈశ్వర్‌రెడ్డి, బసిరెడ్డి దుగ్గిరెడ్డి, తిప్పన నాగార్జున, రామగురివిరెడ్డి, ఉమాపతి, యల్లటూరు శివారెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:17:18+05:30 IST