Abn logo
May 18 2021 @ 00:38AM

ఆరు నెలల్లో అందుబాటులోకి 100 పడకల ఆసుపత్రి

100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రజిని

ఎమ్మెల్యే విడదల రజిని

చిలకలూరిపేట, మే 17 : చిలకలూరిపేటలో మరో ఆరు నెలల్లో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. పట్టణంలోని 30 పడకల సామాజిక ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే విడదల రజిని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.15 కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ ఆసుపత్రిలో అదనంగా కావలసిన మరో రూ.11 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు, పైపులైన్ల నిర్మాణం, బ్లడ్‌బ్యాంకు, ట్రామాకేర్‌ సెంటర్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఓగేరువాగు వరద ముంపు ముప్పు లేకుండా రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం కూడా చేపట్టనున్నామన్నారు.

Advertisement