పరిషత్‌ ఫలితాలు ఏకపక్షమే..

ABN , First Publish Date - 2021-09-19T04:16:13+05:30 IST

పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఏకపక్షంగా ఉంటాయని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

పరిషత్‌ ఫలితాలు ఏకపక్షమే..
ఇందిరమ్మ కాలనీలో ప్రజా సమస్యలు వింటున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి

కావలిటౌన్‌, సెప్టెంబరు 18: పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఏకపక్షంగా ఉంటాయని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ముసునూరులోని ఆయన నివాసంలో 13 మంది బాధితులకు రూ.5.65 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఫలితాలు ఆపాలని టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా సాధ్య పడలేదన్నారు. ఆదివారం జరగనునన ఓట్ల లెక్కింపు ఫలితాలు టీడీపీకి చెంపపెట్టులాంటిదన్నారు. కావలి నియోజకవర్గంలో అన్ని స్థానాలు వైసీపీ గెలుసుకుంటుందన్నారు.

గుక్కెడు నీరు ఇప్పించండి సారూ...

గుక్కెడు నీరు ఇప్పించండి సారూ అంటూ బుడమగుంట ఇందిరమ్మ కాలనీ మహిళలు ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డికి మొరపెట్టుకున్నారు. శనివారం మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి బుడమగుంట ఇందిరమ్మ కాలనీని ఎమ్మెల్యే సందర్శించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటి ఎదుట ఖాళీ డ్రమ్ములు దర్శనమివ్వడం గమనించిన ఎమ్మెల్యె నీటి సమస్య ఎంత తీవ్రంగా తెలుసుకుని వీలైనంత త్వరగా పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసి నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్న, అధికార ప్రతినిధి పందిటి కామరాజు, దామిశెట్టి సుధీర్‌నాయుడు, గుర్రం వెంకటేశ్వర్లు, ఖమర్‌బాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కనమర్లపూడి నారాయణ, మాజీ కౌన్సిలర్‌ పేరం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T04:16:13+05:30 IST