గొర్రెపాడులో చెరకు పంటకు నిప్పు

ABN , First Publish Date - 2020-06-05T10:19:45+05:30 IST

మండలంలోని గొర్రెపాడులో బుధవారం అర్ధరాత్రి కోతకు వచ్చిన రెం డు ఎకరాల నల్ల చెరకు పంట కాలి బూడిదయింది.

గొర్రెపాడులో చెరకు పంటకు నిప్పు

రూ.3లక్షల నష్టం.. పరిశీలించిన ఎమ్మెల్యే రవికుమార్‌ 


బల్లికురవ, జూన్‌ 4 : మండలంలోని గొర్రెపాడులో బుధవారం అర్ధరాత్రి కోతకు వచ్చిన రెం డు ఎకరాల నల్ల చెరకు పంట కాలి బూడిదయింది. గొర్రెపాడు గ్రా మానికి చెందిన రైతు ముండ్రు గోపాల్‌ రెండు ఎకరాల్లో చెరకును సాగు చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా పంటను అమ్ముకోలేకపోయాడు. ఈలోపే పంట ఆహుతైందని, సుమారు రూ.3లక్షల విలువైన పంట దగ్ధమైందని రైతు విలపించారు.


ఎవరైనా కావాలని పంటకు నిప్పు పెట్టారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్నదానిపై రైతు అనుమానం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కాలిపోయిన పంటను పరిశీలించారు. ప్రమాద వివరాలను బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఎవరో కావాలనే చేశారని ఎమ్మెల్యే ముందు వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ శివనాంచారయ్యకు ఎమ్మెల్యే రవికుమార్‌ సూచించారు. పంటకు నష్టపరిహారం అందేలా కలెక్టర్‌తో మాట్లాడతానని ఎమ్మెల్యే తెలిపారు.

 

Updated Date - 2020-06-05T10:19:45+05:30 IST