‘నువ్వుండగా నాకు మంత్రి పదవి ఎలా వస్తుంది?’

ABN , First Publish Date - 2021-04-11T08:18:41+05:30 IST

‘‘రెడ్యా.. నీకు మళ్లీ మం త్రి పదవి వస్తుందిలే’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అనగా.. ‘‘నువ్వండగా నాకు మంత్రి పదవి ఎలావ స్తుం ది?’’

‘నువ్వుండగా నాకు మంత్రి పదవి ఎలా వస్తుంది?’

మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

హన్మకొండ టౌన్‌, ఏప్రిల్‌ 10: ‘‘రెడ్యా.. నీకు మళ్లీ మంత్రి పదవి వస్తుందిలే’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అనగా.. ‘‘నువ్వండగా నాకు మంత్రి పదవి ఎలా వస్తుంది?’’ అని ఎదురు ప్రశ్న వేశా రు డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌. వీరిద్దరి ఛలోక్తులకు శనివారం జరిగిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీసీసీబీ సమావేశం వేదికైంది. వీరిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. సమావేశంలో రెడ్యానాయ క్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గంపై వివక్ష కొనసాగుతోందని వాపోయా రు. మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ మంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశావని అన్నా రు. దీంతో రెడ్యా మాట్లాడుతూ తాను ఎవరి వద్దా మంత్రి పదవిని గుంజుకోలేదని ఆయన (వైఎస్‌) తనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో తెలియద ని అయినా ఇప్పుడు అవి ఎందుకులే అని అన్నారు. ‘నీకు మళ్లీ అవకాశం వస్తుందిలే’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించగా.. ‘నువ్వుండగా నాకు ఎలా వస్తుంది‘ అనిరెడ్యా అన్నారు.  

Updated Date - 2021-04-11T08:18:41+05:30 IST