ఓట్లు దండుకునేందుకే ‘దళిత బంధు’

ABN , First Publish Date - 2021-08-03T05:16:45+05:30 IST

ఓట్లు దండుకునేందుకే ‘దళిత బంధు’

ఓట్లు దండుకునేందుకే ‘దళిత బంధు’
సమావేశంలో మాట్లాడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

 ఎమ్మెల్యే సీతక్క

గూడూరు రూరల్‌, ఆగస్టు 2 : హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారని ములుగు ఎమ్మెల్యే, మహిళ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని గూడూరు మండలం సురేష్‌నగర్‌తండాలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హరితహారం పేరుతో ఉన్న భూములను గుంజు కోవడం సిగ్గుచేటన్నారు. అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటు న్న పోడు భూముల్లో నుంచి ఇంచు కూడా వదులుకో బోమని చెప్పారు. కొత్తగా మేము అడవులు కొట్టం... ఉన్న భూములను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఎంత మం ది గిరిజనులకు హక్కుపత్రాలు, పట్టాలు ఇచ్చారో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ల్లో ఓట్లు దండుకునేందుకు దళిత బంధు ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడం విడ్డూరం గా ఉందన్నారు. దళితులకు ఇవ్వాల్సింది దళితబంధు కాదని, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ  కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, పీసీసీ మాజీ కార్యదర్శి నూనావత్‌ రాధ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కత్తిస్వామి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు నూనావత్‌ రమేష్‌నాయక్‌, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ వేం వాసుదేవరెడ్డి, మైనారిటీ సెల్‌ రాష్ట్ర నాయకుడు యాకూబ్‌పాషా,  మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆమరేందర్‌రెడ్డి, సొసైటీ వైస్‌చైర్మన్‌ వేం శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కొడిదెల సంజయ్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బుడిగె సతీష్‌, ఉపసర్పంచ్‌ శివరాత్రి సంపత్‌, శ్రీపాల్‌రెడ్డి, మండల మల్లేష్‌, పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-03T05:16:45+05:30 IST