ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-18T06:06:25+05:30 IST

ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ 

కేసముద్రం, ఏప్రిల్‌ 17 : కేసముద్రంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. కేసముద్రం రైతువేదిక భవనంలో శనివారం 150 మందికి రూ.1,50,17,400 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద మం జూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.  కేసముద్రంలో ప్రధాన రహదారి వెంట, ఉప్పరపల్లి రోడ్‌లో ప్ర భుత్వ భూములని బోర్డులు పెట్టిన స్థలాల్లో యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తోంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. కల్యాణలక్ష్మి పథకాల్లో వీఆర్‌వో, వీఆర్‌ఏల ప్రమేయం లేకుండా సర్పంచుల ద్వారా దరఖాస్తును స్వీకరించి మంజూరు కోసం పంపించాలని తహసీల్దార్‌కు సూచించారు. పెళ్లి జరుగుతున్న సమయంలో మండపంలోనే కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చే ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  తహసీల్దార్‌ సరితారాణి, ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచులు ఎన్నమాల ప్ర భాకర్‌, భట్టు శ్రీను, వైస్‌ ఎంపీపీ రావుల నవీన్‌రెడ్డి, సొ సైటీ చైర్మన్‌ ధీకొండ వెంకన్న, ఎంపీటీసీలు సట్ల వెంక న్న, కొమ్ము స్వాతి, నజీర్‌అహ్మద్‌, ముత్యాల శివకుమార్‌, దామెరకొండ ప్రవీణ్‌, కముటం శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

లబ్ధిదారుల్లో ఒకరికి కరోనా..

కేసముద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్ద లబ్ధిదారులకు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యే వచ్చిన సమయంలోనే ఒక మహిళకు పాజిటివ్‌ రావడంతో కలకలం రేపింది. వెంటనే సదరు మహిళను హోం క్వారెంటైన్‌లో ఉండాలని అక్కడి నుంచి పంపించారు. 

 

Updated Date - 2021-04-18T06:06:25+05:30 IST