కల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T04:29:54+05:30 IST

కల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

కల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
జైపాల్‌యాదవ్‌ రాజీనామా చేయాలని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

కడ్తాల్‌: కల్వకుర్తి ప్రాంత అభివృద్ధిని కాంక్షించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ రాజీనామా చేయాలని కడ్తాలలో బీజేపీ, బీజేవైఎం నాయకులు గురువారం నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగేనియోజకవ ర్గాల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రూ.కోట్ల బడ్జెట్‌ ఇస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజల మేలుకోరి కల్వకుర్తిలోనూ ఉపఎన్నిక వచ్చేలా వెంటనే జైపాల్‌ రాజీనామా చేయాలని ప్లకార్డులతో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సిరిగి బ్రహ్మచారి, బీజేపీ మండల అధ్యక్షుడు పాత్లావత్‌ మన్యానాయక్‌, దళితమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్వకుర్తికి ఉపఎన్నిక వస్తే రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగే ఆస్కారం ఉన్నందున జైపాల్‌ పెద్ద మనసుతో రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు సాయిలాల్‌, అశోక్‌రెడ్డి, జె.రవి, శ్రీశైలంగౌడ్‌, డి.మహేశ్‌, ప్రేమ్‌రాజ్‌, కె.రవి, శంకర్‌, వినయ్‌కుమార్‌, మల్లేశ్‌, మధు, మహేశ్‌, శివ, భీమానాయక్‌ పాల్గొన్నారు.


  • ‘మంత్రుల పర్యటనుంటే అరెస్టులా?’


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): మంత్రుల పర్యటన ఉంటే.. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులా..? ఇదేం అరాచకం.. ఇదేం పాలన అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రుల పర్యటన ఉంటే బీజేపీ, బీజేవైఎం నాయకులను రాత్రి నుంచి అరె్‌స్టలు, గృహ నిర్బంధం చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేవైఎం నాయకులు సమస్యలు చెప్పుకోవడానికి కేటీఆర్‌ వద్దకు వెళ్తే పోలీసులతో కొట్టించడం అమానుషమన్నారు. అరెస్టులపై చూపుతున్న శ్రద్ధ నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీపై చూపించాలని హితవు పలికారు.



  • ‘ముందస్తు అరెస్టులు అన్యాయం’


కొత్తూరు/కందుకూరు/మొయినాబాద్‌: తుక్కుగూ డలో మంత్రుల పర్యటనను అడ్డుకుంటారని బీజేపీ నాయ కులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని కొత్తూరు మండల బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఫ్యాబ్‌సిటీలో మంత్రుల పర్యటన నేపథ్యంలో తమను అరెస్టు చేశారని తిమ్మాపూర్‌ మాజీ ఎంపీటీసీ తెలిపారు. అరెస్టయిన వారి లో పార్టీ కొత్తూరు మున్సిపల్‌ అధ్యక్షులు నాగరాజుచారి, జిల్లా యువమోర్చా కార్యదర్శి రణధీర్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, శేఖర్‌, జగన్‌, మల్లేశ్‌ ఉన్నారు. మొయినాబాద్‌లో కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, జ్ఞానేశ్వర్‌, పద్మనాభం, మహేందర్‌, మల్లారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ ప్ర భాకర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు భర్తీ    చేయాలని చలో రాజ్‌భవన్‌కు తరలిన బీజేపీ నాయకుల ను పోలీసులు అరెస్టు చేశారు. కందుకూరులో జంగారెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, ఎస్‌.భూమిరెడ్డి, అంజిరెడ్డి, మహేందర్‌లను సీఐ కృష్ణంరాజు నేతృత్వంలో స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-07-30T04:29:54+05:30 IST