భారతీయుడిగా గర్విస్తున్నా: ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2021-01-17T14:00:05+05:30 IST

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్‌కు..

భారతీయుడిగా గర్విస్తున్నా: ఎమ్మెల్యే శివకుమార్

‌తెనాలి(గుంటూరు): ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్‌కు మన భారతీయులు వ్యాక్సిన్‌ తయారుచేసి కోవిడ్‌ బాధితులకు సేవలందించిన వారికి తొలి టీకా ఇచ్చి గౌరవించడం భారతీయుడిగా గర్విస్తునాన్నని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వవైద్యశాల్లో తొలివిడతగా వ్యాక్సిన్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సనత్‌కుమారి అధ్యక్షతవహించిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్‌ రోగులకు వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. తమ పరిధిలో 2081 మందికి టీకా వేయాల్సి ఉందని  సూపరింటెండెంట్‌ సనత్‌కుమారి అన్నారు. రోజుకు దాదాపుగా 100 మందికి అందించనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి 28 రోజుల తరువాత రెండోసారి వేయనున్నట్లు చెప్పారు. జిల్లా కో ఆర్డినేటర్‌ అండ్‌ హాస్పటల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ ఈశ్వరప్రసాద్‌ తొలి టీకాను డాక్టర్‌ హనుమంతరావుకు వేశారు. సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జశ్వంతరావు, డీఎంహెచ్‌వో నరసింహానాయక్‌, నర్సింగ్‌ స్టాప్‌ సూపరింటెండెంట్‌ ఆదిలక్ష్మి సభలో ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ అర్జా రాజేంద్ర, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T14:00:05+05:30 IST