Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 17 2021 @ 14:27PM

సభను బుల్డోజ్ చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

హైదరాబాద్: మంద బలంతో అసెంబ్లీ సమావేశాలను బుల్డోజ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. సంఖ్యా బలంతో సభను సీఎం ఏకపక్షంగా నడిపిస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.


45 రోజులు జరగాల్సిన సమావేశాలను ఆరు రోజులకు కుదించటం‌ సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై సభలో ప్రతిపక్షాలు మాట్లాడితే సీఎంకు నచ్చటం లేదని ఆయన విమర్శించారు. విభజన హామీల సాధన కోసం ప్రతిపక్షాలను కేంద్రం దగ్గరకు కేసీఆర్ తీసుకెళ్ళాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement