Abn logo
Jul 8 2020 @ 05:15AM

రైతు కుటుంబాలకు చేయూత

నర్సంపేట, జూలై 7:  డివిజన్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన 11 మంది రైతు కుటుంబాలకు క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం బీమా చెక్కులను అందించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల వంతున బీమా చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు త్వరగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో ఒడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, జడ్పీ వైస్‌ చెర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మోతె జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement