కొవిడ్‌ బాధితులకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-05-18T06:09:57+05:30 IST

ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరూ మృతి చెందకూడదనే ఉద్ధేశ్యంతో తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు.

కొవిడ్‌ బాధితులకు అండగా ఉంటా

 ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం, మే 17 : ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరూ మృతి చెందకూడదనే ఉద్ధేశ్యంతో తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఆక్సిజన్‌ సిలిండర్‌లను సోమవారం డీజీపీ గౌతం సవాంగ్‌కు ఎమ్మెల్యే వంశీ  అందజేశారు. వంశీ మాట్లాడుతూ కరోనా వంటి  విపత్కర పరిస్థితుల్లో  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ ఉద్యోగులకు  ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేసినట్లు తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిని తట్టుకునేందుకు ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్త లు పాటించాల్సిందేనన్నారు. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్ధ కొవిడ్‌ సెంటర్‌కు ఎమ్మెల్యే వంశీ పంపిన మరో 20 ఆక్సిజన్‌ సిలిండర్‌లతో పాటు 50 ఆక్సిజన్‌ ఫ్లోమీటర్‌లను సోమవారం వైసీపీ నాయకులు ప్రిన్సిపాల్‌ పి.ఎస్‌.ఎన్‌.మూర్తికి  అందజేశారు.  వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, అనగాని రవి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎమ్మెల్యే వంశీ తీసుకున్న చొరవ ఆయన దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఈ కొవిడ్‌ సెంటర్‌కు 70, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి 100 ఆక్సిజన్‌ సిలిం డర్‌ లను అందజేసినట్లు తెలిపారు. వైసీపీ నాయకులు ఓలుపల్లి రంగా, మేచినేనిబాబు, సర్పంచ్‌లు గోగులమూడి విజయలక్ష్మీ, బాణావతు తిరుపతమ్మ, మాజీ వైస్‌ ఎంపీపీ గొంధి పరంధామయ్య, ఏఈ రాణి, మెండెం రాంబాబు, మోదుగుమూడి వెంకటేశ్వరరావు, మూల్పూరు ప్రభుకాంత్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-18T06:09:57+05:30 IST