కాజ్‌వే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-04-09T05:45:10+05:30 IST

చిన్నచింతకుంట మండల కేంద్రం నుంచి కురుమూర్తి ఆలయానికి వెళ్లే వాగులో దాదాపు రూ.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవెల్‌ బ్రిడ్జి, కమ్‌ చెక్‌ డ్యామ్‌ పనులను శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలిం చారు.

కాజ్‌వే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, తదితరులు

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 8 : చిన్నచింతకుంట మండల కేంద్రం నుంచి కురుమూర్తి ఆలయానికి వెళ్లే వాగులో దాదాపు రూ.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవెల్‌ బ్రిడ్జి, కమ్‌ చెక్‌ డ్యామ్‌ పనులను శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలిం చారు. ఆయన స్వయంగా పనుల పురోగతి తీరును సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న వర్షాకాలంలోపు ఈ హైలెవెల్‌ బ్రిడ్జి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కురుమూర్తి బ్రహ్మోత్సవాల నాటికీ భక్తుల సౌకర్యార్ధం రాకపోకలకు అనువుగా ఉండే విధంగా కూడా బీటీ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. మండలంలోని లో వోల్టేజీ కారణంగా ఆయా గ్రామాల్లో పలు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కొంతమంది రైతులకు ఎమ్మెల్యే ట్రాన్స్‌ఫార్మర్లను అందజేశారు. 

వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ

మండలంలోని ఎదులాపూర్‌ గ్రామంలో శుక్రవారం శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల ఎదుట ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు, బొడ్రాయి, గణపతి, నంది ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు సురేందర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ హేమలత, టీఆర్‌ఎస్‌ నాయకులు కోట రాము, వట్టెం రాము తదితరులు పాల్గొన్నారు.    

ఆలయం అభివృద్ధికి కృషి

దేవరకద్ర, ఏప్రిల్‌ 8 : మండల కేంద్రంలోని వెలిసిన ఈశ్వర వీరప్పయ్య ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈశ్వర వీరప్పయ్య 93వ సప్తాహ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, చైర్మన్‌కొండ రాధికాభాస్కర్‌ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం ఫలికారు. అనంతరం ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ండ్‌ చెక్కును అందజే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్‌, కొండ శ్రీను, కర్ణం రాజు, వెంకటేష్‌, బాలస్వామి, వెంకట్రా ములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-09T05:45:10+05:30 IST