Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీటీడీలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ దుర్మార్గం: Ashok babu

అమరావతి: టీటీడీలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ దుర్మార్గమని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తక్షణమే సస్పెన్షన్ ను ఎత్తివేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికులను మూడు నెలల్లో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్మికుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  అర్హతలేని వ్యక్తులను బోర్డు మెంబర్లుగా తీసుకోవడానికి అడ్డురాని నిబంధనలు ఉద్యోగులకు అడ్డుపడుతున్నాయా? అని అశోక్‌బాబు నిలదీశారు. 

Advertisement
Advertisement