Advertisement
Advertisement
Abn logo
Advertisement

గౌరవసభను కౌరవసభలా మార్చారు

వైసీపీ నాయకులపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఫైర్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 2: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చట్టసభలో మహిళలను కించపరచేలా మాట్లాడుతూ గౌరవసభను కౌరవసభలా మార్చడం వైసీపీ నాయకులకే చెల్లిందని టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వీరవల్లి అధ్యక్షుడు లంక సురేంద్రమోహన బెనర్జీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన గౌరవసభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్జునుడు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ ప్రజా ప్రతినిధులను బయటకు పంపేందుకే వ్యక్తిత్వ హననానికి వైసీపీ నాయకులు పూనుకున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఇంటిపైనా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఓటీఎస్‌ పథకానికి ఎవరూ నగదు కట్టవద్దని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని అర్జునుడు హామీ ఇచ్చారు.క్రమశిక్షణకు మారుపేరైన నందమూరి కుటుంబంలోని మహిళ పట్ల గౌరవసభలో హేళనగా మాట్లాడటం తప్ప,ప్రజా సమస్యలపై చర్చించే తీరిక వైసీపీ నాయకులకు లేదని టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అన్నారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే నీరో చక్రవర్తి లాగా టీడీపీపై వ్యర్థ ప్రేలాపలనలు చేయడమేనా పాలన అంటే అని ఆమె ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజా రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని, రాష్ట్ర జీవనాడి పోలవరంపై ఆర్భాటపు ప్రచారం చేయడం తప్ప ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం చేతకాలేదని సంప్కారహీనంగా మహిళలను కించపరుస్తూ గౌరవసభలో మాట్లాడారని, అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళా రైతులపైనా నీచంగా మాట్లాడటంవైసీపీ ప్రభుత్వ పెద్దలకే చెల్లిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, తెలుగు రైతు కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్‌, కార్యదర్శి దొంతు చిన్నా, ఎంపీటీసీ సభ్యుడు అమృతపల్లి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌ పిల్లా రామారావు, తెలుగు యువత నాయకుడు మండాది రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement