Abn logo
Jan 14 2021 @ 16:52PM

బండి సంజయ్‌ హెడ్‌లైన్స్‌ కోసం డెడ్‌లైన్‌ విధిస్తారు-బోడకుంటి

హైదరాబాద్‌: తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై బండిసంజయ్‌ నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని శాసన మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. జనగామ ఇష్యూలో ఒక్కో ఊరిలో ఒక్కో డెడ్‌లైన్‌పెట్టారని ఎద్దేవా చేశారు. నిజానికి బండి సంజయ్‌ హెడ్‌లైన్స్‌ కోసమే డెడ్‌లైన్స్‌ విధిస్తారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడారు. చిన్న విషయాలు బూతద్దంలో పెట్టిచూస్తున్నారని అన్నారు. దుబ్బాకలో అలాగే చేశారని అన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్నవిషయాలకే అరాచకాలు అలజడులు చేయాలని చూస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 


వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కూల్చుకున్నారని గుర్తుచేశారు. పార్లమెంట్‌ సభ్యుడిగా సంజయ్‌ హుందాతనంగా మాట్లాడాలని సూచించారు. కేటీఆర్‌పై అకారణంగా విమర్శలుచేస్తున్నారని ఆరోపించారు. జనగామలో జరిగిన చిన్న ఘటనకు చలో జనగామాపిలుపునిచ్చారు. పార్టీసీనియర్‌ నాయకులు సంజయ్‌ను సరిగ్గా మాట్లాడమని హితవుచెప్పాలన్నారు. జనగామ అంశాన్నిరాష్ట్రస్థాయి సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బిజెపికి తగిన బుద్దిచెప్తామని హెచ్చరించారు. బూతుపురాణం అందుకుంటే పెద్దనేతగా ఎదగలేరని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement