‘సుమోటో’గా జైలుకెళ్లారు గుర్తుందా?: బుద్దా

ABN , First Publish Date - 2020-06-01T08:38:36+05:30 IST

ఎల్‌జీ బాధితుల్ని పరామర్శిస్తానని.. సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్లాడు ఒకాయన. నాకు నేనే సుమోటోగా ఎన్నికల ..

‘సుమోటో’గా జైలుకెళ్లారు గుర్తుందా?: బుద్దా

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): ‘ఎల్‌జీ బాధితుల్ని పరామర్శిస్తానని.. సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్లాడు ఒకాయన. నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్‌నని ఆర్డర్‌ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన. అసలు ఈ సుమోటోలు ఏమిటో..?’ అని ప్రశ్నిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ‘‘సుమోటో అనే పదం మీకు అర్థం కాకపోవడమేంటి సాయిరెడ్డి గారూ? సుమోటోగా 16 నెలలు జైలుశిక్ష, సుమోటోగా 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఎదగడం.. ఇవన్నీ సుమోటోగా చేసుకున్న స్వయంకృతాపరాధాలే కదా!’ అని రీ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-06-01T08:38:36+05:30 IST