పేదలకు రూ.5 వేలు ఇవ్వాలి : ఎమ్మెల్సీ బుద్ద

ABN , First Publish Date - 2020-04-05T09:40:32+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటువంటి ఆధారం లేని నిరుపేదలకు ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు శనివారం డిమాండ్‌ చేశారు.

పేదలకు రూ.5 వేలు ఇవ్వాలి : ఎమ్మెల్సీ బుద్ద

అనకాపల్లి/కశింకోట, ఏప్రిల్‌ 4 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటువంటి ఆధారం లేని నిరుపేదలకు ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు శనివారం డిమాండ్‌ చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి  రూ.వెయ్యి ఎన్ని రోజులు సరిపోతాయని  ప్రశ్నించారు.  టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే హక్కు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేవన్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం రూ.1.95 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు సమర్ధవంతమైన పాలనతో అందరి సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. అలాగే, కశింకోటలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య, పారిశుధ్య సిబ్బందిని ఆదుకోవడం లేదన్నారు. తెల్లకార్డుదారునికి ఐదువేలు ఇచ్చితీరాలన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లను పేరు మార్పు చేసైనా తెరవాలని కోరారు.

Updated Date - 2020-04-05T09:40:32+05:30 IST