ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-24T05:44:09+05:30 IST

కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ డిపార్టుమెంట్‌ సెక్రెటరీ కేవీ రమణ తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకుడు కేవీ రమణ, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు సజావుగా  నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ డిపార్టుమెంట్‌ సెక్రెటరీ కేవీ రమణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌కి వచ్చిన ఆయన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌తో కలిసి నోడల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. ఎన్నికలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లందరికీ ఓటర్‌ స్లిప్పులు 100 శాతం పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో మరో 600 ఓట్లు అదనంగా చేరే అవకాశం ఉందన్నారు. ఓటింగ్‌, కౌంటింగ్‌ సిబ్బందిని నియమించి శిక్షణ అందించామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(ఆసర) కే శ్రీధర్‌రెడ్డి, కృష్ణ జిల్లా డీఆర్‌వో ఎం వెంకటేశ్వర్లు, అర్బన్‌ జిల్లా అదనపు ఎస్పీ గంగాధర్‌, రూరల్‌ జిల్లా డీఎస్పీ జీ లక్ష్మయ్య, నోడల్‌ టీం అధికారులైన జడ్పీ సీఈవో చైతన్య, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, సాంఘిక సంక్షేమ డీడీ మధుసూదనరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుకన్య, డీటీసీ మీరాప్రసాద్‌, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ ధనుంజయ, బీసీ కార్పొరేషన్‌ డీడీ కల్పనబేబి పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-24T05:44:09+05:30 IST