నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి

ABN , First Publish Date - 2021-03-03T05:50:46+05:30 IST

నిష్పక్షపా తంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులకు సూచించారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి

ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ

ఏలూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): నిష్పక్షపా తంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. హ్యాండ్‌ బుక్‌ చదివి అర్థం చేసుకోవాలన్నారు.బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లకు సంబంధించి ముందు గానే అన్నీ సరిచూసుకోవాలన్నారు. జేసీ వెంకట రమణారెడ్డి, డీఆవో శ్రీనివాస మూర్తి, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T05:50:46+05:30 IST