Abn logo
Jun 12 2021 @ 00:19AM

చిన్నారి వైద్యానికి ఎమ్మెల్సీ కవిత హామీ

గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందిస్తానని వెల్లడి

నిజామాబాద్‌, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 11 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 5 నెలల పాప మోక్షను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆ పా పకు మెరుగైన వైద్యం అందించి అండగా ఉంటా నని హామీ ఇచ్చారు. పాప వైద్యానికి కావాల్సిన సహాయం అందించడంతో పాటు కోలుకునేందు కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాననిపాప తం డ్రికి భరోసా ఇచ్చారు. శుక్రవారం వారు ఎమ్మెల్సీ క్యాంప్‌ కార్యాలయానికి రాగా.. హైదరాబాద్‌లోని రేయిన్‌బో గానీ, కేర్‌ ఆసుపత్రిలో వైద్యం అందిం చే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. త ల్లిదండ్రులు ఈ రెండు ఆసుపత్రుల్లో పాపను దే నిలో చేర్చినా చికిత్సకు ఏర్పాట్లు చేయిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత పిల్లల ఆరోగ్యంపట్ల మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. 

ఉచిత భోజన తయారీ కేంద్రం పరిశీలన

అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తన తం డ్రి బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కరోనా బాధితులకు గత 36 రోజులుగా అందిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భోజనాలు అందజేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం నగరంలోని పూలాంగ్‌ చౌరస్తాలో జరుగుతున్న సుందరీకరణ, వైడ్‌ డి వైడర్‌ పనులను పరిశీలించారు. 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి తల్లి ఇటీవల మృతిచెంద గా ఆమెను పరామర్శించారు. మాయావర్‌ సా యిరాం వియ్యంకుడు మృతిచెందగా ఆయన కు టుంబాన్ని, జర్నలిస్టు బాలు కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె వెంట ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, బిగాల మహేష్‌, రెడ్‌ కో చైర్మన్‌ హలీం, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, తదితరులు ఉన్నారు.

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టి ంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కవిత అ న్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పా ర్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఆమె అ ర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాతో కలిసి పరి శీలించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దేశ అభివృద్ధి చిత్రపటాన్ని మా రుస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్బావం నుంచి ప్రజల కోసమే పనిచేస్తోందని అన్నారు. దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటి గా టీఆర్‌ఎస్‌ నిలబడిందన్నారు. తెలంగాణ ప్రజ ల గుండె చప్పుడుగా పార్టీ ఉందని అన్నారు. పా ర్టీ ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని అ న్నారు. పార్టీకి ప్రజలు అండగా ఉన్నారన్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తు న్నారన్నారు. ఈ కార్యాలయాలు కార్యకర్తలతో పాటు ప్రజలకు ఉపయోగపడతాయని అన్నారు. జిల్లా కేంద్రానికి అవసరాల కోసం వచ్చే వారికి కార్యాలయాలలో ఉండేవారు అండగా ఉంటార న్నారు. కార్యకర్తల ఇన్సూరెన్సుతో పాటు ఇతర ప నులను చేసి పెడుతారని ఆమె తెలిపారు. పార్టీ కార్యాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిం దని ఆమె తెలిపారు. ఈ కార్యాలయాన్ని త్వర లోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ ంలో రెడ్‌కో చైర్మన్‌ అలీమ్‌, పార్టీ సీనియర్‌ నేత పోశెట్టి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement