సెక్షన్‌ 8ని మేం కోరుకోవడం లేదు.. కానీ..: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-07-08T20:48:31+05:30 IST

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలును తాము కూడా కోరుకోవడం లేదని, కానీ సీఎం కేసీఆరే ఆ పరిస్థితిని కల్పిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ

సెక్షన్‌ 8ని మేం కోరుకోవడం లేదు.. కానీ..: జీవన్ రెడ్డి

జగిత్యాల: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలును తాము కూడా కోరుకోవడం లేదని, కానీ సీఎం కేసీఆరే ఆ పరిస్థితిని కల్పిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజారోగ్యం క్షీణిస్తోన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే సచివాలయమే ముఖ్యం అయిందని విమర్శించారు. అందువల్లనే గవర్నర్‌ను తన అధికారాలను వినియోగించుకోవాలని కోరుతున్నామని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సెక్షన్ 8 అధికారాలు తెలంంగాణ గవర్నర్‌కే ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కోసం మాత్రమే పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ని పొందుపర్చలేదని అన్నారు. ఇదే సమయంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-08T20:48:31+05:30 IST