కేసీఆర్ వల్లే కాళేశ్వరానికి రాని హోదా: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-27T23:08:04+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‎రెడ్డి ఆరోపించారు. జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు ..

కేసీఆర్ వల్లే కాళేశ్వరానికి రాని హోదా: జీవన్ రెడ్డి

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‎రెడ్డి ఆరోపించారు. జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయట పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందన్నారు. కాళేశ్వరం నిర్వహణ కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడం లేదని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పుకు ప్రజలు నష్టపోతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-27T23:08:04+05:30 IST