Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

ఆమనగల్లు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివా్‌సరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనా నారాయణరెడ్డిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. అనంతరం కసిరెడ్డి తనకు రెండవ సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రావు, సురేందర్‌రెడ్డి, హన్మానాయక్‌  తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ.1.36లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక భరోసాను ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సూదిని శ్రీనివా్‌సరెడ్డి, మోత్యనాయక్‌, సురేందర్‌రెడ్డి, హనుమనాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement