బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన

ABN , First Publish Date - 2021-06-20T05:59:51+05:30 IST

జిల్లాకు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. నిఖత్‌ జరీన్‌ ప్రతిభను గుర్తించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరీన్‌కు స్టాఫ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం కల్పించింది.

బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన
నిక్కత్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 19: జిల్లాకు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. నిఖత్‌ జరీన్‌ ప్రతిభను గుర్తించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరీన్‌కు స్టాఫ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం కల్పించింది. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను నిఖత్‌ జరీన్‌ తల్లిదండ్రులు మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మె ల్సీ కవిత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శి ఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి బాక్సింగ్‌లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిఖత్‌ యువత కు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాగే, ఆమెను క్రీడలవైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులు పర్వీన్‌, జమీల్‌లను సై తం కవిత కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:59:51+05:30 IST