ఎందరో ఎమ్మెల్సీ ఆశావహులు.. కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తారో..!

ABN , First Publish Date - 2021-11-09T17:47:08+05:30 IST

శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యత్వాల కోసం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు యత్నాలు మొదలుపెట్టారు. శాసనమండలిలో శాసనసభ్యుల ద్వారా ఎన్నికలు జరిగే

ఎందరో ఎమ్మెల్సీ ఆశావహులు.. కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తారో..!

ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఆశావహులు

సంగారెడ్డి (ఆంధ్రజ్యోతి): శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యత్వాల కోసం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు యత్నాలు మొదలుపెట్టారు. శాసనమండలిలో శాసనసభ్యుల ద్వారా ఎన్నికలు జరిగే స్థానాలు ఆరు ఉండగా.. ఒక స్థానం గవర్నర్‌ ద్వారా నియామకం జరగనున్నది. వీరి ఎన్నిక కోసం ఈనెల 9న (నేడు) నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. శాసనసభ్యులు ఎన్నుకునే ఆరు స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అయిన జహీరాబాద్‌కు చెందిన ఎండీ ఫరీదుద్దీన్‌ మరోసారి అవకాశం కోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్టు తెలిసింది. మైనార్టీ వర్గాల్లో మంచి పేరున్న ఫరీదుద్దీన్‌ సేవలను గుర్తించి, మరో విడత అవకాశం వస్తుందని జిల్లాలోని మైనార్టీలు భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు జి.బీరయ్య యాదవ్‌ శాసనమండలి సభ్యత్వాలను ఆశిస్తున్నారు. తూర్పు ప్రాంతమైన సిద్దిపేట జిల్లా నుంచి సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌రెడ్డి ఎవరికి వారు శాసనమండలి స్థానం కోసం తమ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఈ జిల్లా నుంచి శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా ఫారూఖ్‌ హుస్సేన్‌, రఘోత్తమరెడ్డి ఉన్న విషయం విధితమే.  మెదక్‌ జిల్లా నుంచి శేరి సుభా్‌షరెడ్డి, సంగారెడ్డి జిల్లా నుంచి శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. 


బీసీలకు తగిన అవకాశం ఇవ్వాలి

శాసనమండలిలో భర్తీ చేయనున్న ఏడు స్థానాల్లో బీసీలకు ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లాలోని నాయకులు కోరుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పది ఎమ్మెల్యే స్థానాలలో బీసీలు ఒక్కరు కూడా లేరని, ఎంపీలు కూడా లేరని వారు గుర్తు చేస్తున్నారు. మూడు జిల్లా ప్రజాపరిషత్‌లలో ఒక్క మెదక్‌ జిల్లాలోనే కొనసాగుతున్నారు. శాసనమండలిలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వానికి విన్నవించు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు అవకాశం వస్తుందేమోనన్న ఆశతో పార్టీ వర్గాలున్నాయి. ఇదివరకే ఈ అంశమై అధినేత కేసీఆర్‌ చింతా ప్రభాకర్‌కు హామీ ఇచ్చారని ఆ వర్గాలు ఆశతో ఎదు రుచూస్తున్నాయి. యాదవ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ నాయకుడు బీరయ్య యాదవ్‌ కోరుతున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎ్‌సలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు ఏ పదవి రాలేదు. ఈ సారైనా అవకాశం కల్పించాలని బీరయ్య యాదవ్‌ పార్టీ నాయకత్వాన్ని కోరారు.

Updated Date - 2021-11-09T17:47:08+05:30 IST