భారం మోపేందుకు రెవెన్యూ చట్టం..

ABN , First Publish Date - 2020-10-01T10:52:34+05:30 IST

ప్రజలపై పన్నుల భారం మో పేందుకే రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు

భారం మోపేందుకు రెవెన్యూ చట్టం..

సంబరాల పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు..ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి


జగిత్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలపై పన్నుల భారం మో పేందుకే రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి భౌతిక దూరం పాటించకుండా డీజేలతో నృత్యాలు చేయంట ఏంటని ప్రశ్నించారు. సంబరాలు చేసుకోవడం కాదని, రెండు, మూడు మాసాలు ఆగితే అసలు కథ తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్య మంత్రి వ్యవహారం అర్థం కావడం లేదని, రెవెన్యూ చట్టం వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, కేవలం వీఆర్‌వోలను తొలగించడం, రిజిస్ర్టేషన్‌, మ్యూట్యేషన్లు ఏక కాలంలో జరుగడం తప్ప దీనివల్ల కొత్తగా వచ్చే లాభం లేదన్నారు. నిజంగా రైతులకు, ప్రజలకు కొత్త చట్టం వల్ల లబ్ధి చేకూర్చితే తాము కూడా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తామన్నారు. ప్రభుత్వా నికి రైతులపై ప్రేమ ఉంటే సన్న రకం వరిధాన్నాన్ని ప్రభుత్వమే ఐకేపీ కొ నుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్ర భుత్వం ఆలోచన చేసి సన్నరకం వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2500 చె ల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట కోతకు వస్తుం దని, అక్కడక్కడ రైతులు అమ్మకానికి తీస్తున్నారని అన్నారు.


మార్కెట్‌లో ధర క్వింటాల్‌కు రూ.1400 నుంచి రూ.1730 పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రంపై నెపం నెట్టకుండా మార్క్‌ఫెడ్‌ ఆధ్వ ర్యంలో మొక్కజొన్న పంటలు కొనుగోలు చేయించాలని అన్నారు. జిల్లా మం త్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించా లన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కు మార్‌, రాష్ట్ర నాయకులు బండ శంకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగ భూషణం, గుంటి జగదీశ్వర్‌, గాజుల రాజేందర్‌, గంగం మహేష్‌, మన్సూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:52:34+05:30 IST