Abn logo
Sep 19 2021 @ 00:50AM

ఎమ్మెల్సీ తోట కుమారుడికి తప్పిన ప్రమాదం

ద్రాక్షారామ, సెప్టెంబరు 18: శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు కుమారుడు తోట పృథ్వీరాజ్‌ శుక్రవారం రాత్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మండపేటలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి వస్తుండగా వెంకటాయపాలెం సాయిమాధవానంద ఫంక్షన్‌ హాలువద్దకు వచ్చేసరికి రోడ్డు పక్క లే అవుట్‌ నుంచి ముగ్గురు యువకులు బైక్‌పై అకస్మాత్తుగా కారుకు అడ్డుగా వచ్చారు. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి యువకులను తప్పించి కారు పక్కకు మళ్లించడంతో కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న పృథ్వీరాజ్‌కు ప్రమాదం తప్పింది. కారు డ్రైవరుకు స్పల్ప గాయాలయ్యాయి. ముందు ఆందోళన చెందిన తోట అభిమానులు తర్వాత సమాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.