Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు, రేపు పలు MMTS రైళ్ల రద్దు.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ : ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈనెల 15,16 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్‌నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేసినట్లు చెప్పారు.

వివిధ మార్గాల్లో ..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు సీపీఆర్‌ఓ రాకేష్‌ తెలిపారు. కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌ (నంబర్‌ 82727) సువిధ స్పెషల్‌ ఈనెల 16న, కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌(07537) 18న, నర్సాపూర్‌-వికారాబాద్‌ (07496) వన్‌ వే 16, 18 తేదీల్లో, మచిలీపట్నం-సికింద్రాబాద్‌ (07298) 17, 19 తేదీల్లో, నర్సాపూర్‌-వికారాబాద్‌ (07089 నంబర్‌ జన్‌సాధారణ్‌ స్పెషల్‌) 17న, అనకాపల్లి-సికింద్రాబాద్‌ (07436 నంబర్‌ జన్‌సాధారణ్‌ స్పెషల్‌) 16న, తిరుపతి-సికింద్రాబాద్‌(07437 జన్‌సాధారణ్‌ స్పెషల్‌)17న, కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌(నంబర్‌ 07539) 17న నడుస్తాయని చెప్పారు.

Advertisement
Advertisement