ఆసుపత్రిలో ఆర్తనాదాలు

ABN , First Publish Date - 2021-07-25T04:17:51+05:30 IST

పిరట్వానిపల్లి మృతుల బంధువుల రోదనలు అందరినీ కలిచి వేశాయి..

ఆసుపత్రిలో ఆర్తనాదాలు
ఆసుపత్రి ఆవరణలో రోదిస్తున్న బాధిత కటుంబ సభ్యులు

- పిరట్వానిపల్లి రోడ్డు ప్రమాద మృతులకు ముగిసిన పోస్టుమార్టం

- అచ్చంపేట ఆసుపత్రి వద్ద విషణ్ణవదనం

- కుటుంబీకులకు మృతదేహాల అప్పగింత

- బాధిత కుటుంబాలకు ఎంపీ రాములు పరామర్శ


అచ్చంపేట టౌన్‌, జూలై 24 : పిరట్వానిపల్లి మృతుల బంధువుల రోదనలు అందరినీ కలిచి వేశాయి.. ఆసుపత్రి ఆవరణ ఆర్తనాదాలతో నిండిపోయింది.. మృతుల్లో పెళ్లి కాని యువకులు కూడా ఉండటంతో, వారి తల్లిదండ్రుల్లో తీరని విషాదం నిండుకున్నది.. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పి రట్వానిపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ కృష్ణ, వైద్యుల ఆధ్వర్యంలో అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. ప్రజలు మృతదేహాలను చూసేందుకు ఆసుపత్రిలోకి వచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు నిలువరించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతదేహాలను సివిల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చి మార్చురీలో ఉంచారు. శనివారం ఉదయం ఏడున్నర గం టలకు బాధిత కుటుంబాల సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడంతో, ఒక్కో మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి పదిన్నర గంటల సమయంలో బాధిత కుటుం బాల సభ్యులకు ఆరు మృతదేహాలను అప్పజెప్పారు. మృతుడు వంశీకృష్ణ కుటుం బ సభ్యులు ఆలస్యంగా రావడంతో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయ న కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. మృతదేహాలను ప్రైవేటు అంబులెన్సులలో వారి వారి సొంత స్థలాలకు తీసుకెళ్లారు. 

కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చే రుకొని మృతదేహాలను చూసి సొమ్మసిల్లిపోయారు. మృతుల్లో కొందరికి పెళ్లి కా వాల్సిన వారు ఉండటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు అడిగే ప్రశ్నలకు పిట్టల్లా రాలిపోయిన పిల్లల గూరించి ఏం చెప్పాలో ఆర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు వారు సమాధానం ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి, బాధిత కు టుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతదేహాలకు ఆర్డీవో పాండు, డీ ఎస్పీ నర్సింహులు, సీ ఐ అనుదీప్‌, ఎస్‌ఐలు ప్రదీప్‌కుమార్‌, రాజు, రమేశ్‌ అజ్మీర్‌, కృష్ణ పర్యవేక్షణలో శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు.



Updated Date - 2021-07-25T04:17:51+05:30 IST