పెట్టుబడుల సలహాల కోసం మొబైల్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-01-20T08:50:59+05:30 IST

మదుపరులకు పెట్టుబడుల సలహాలను అందించేందుకు గాను ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించినట్లు క్యాపిటల్‌ వయా వెల్లడించింది.

పెట్టుబడుల సలహాల కోసం మొబైల్‌ యాప్‌

 విడుదల చేసిన క్యాపిటల్‌వయా 

విజయవాడ: మదుపరులకు  పెట్టుబడుల సలహాలను అందించేందుకు గాను ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించినట్లు క్యాపిటల్‌ వయా వెల్లడించింది. ద్వితీయ, శ్రేణి నగరాల్లోని మదుపరులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది. వాస్తవిక సమయంలో మదుపరుల సందేహాలు తీర్చటంతో పాటు సలహాలు ఇచ్చే విధంగా దీన్ని రూపొందించినట్లు క్యాపిటల్‌వయా బిజినెస్‌ హెడ్‌ అనంత్‌ సిక్రీ తెలిపారు. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల అవకాశాలు సహా ఇతర పెట్టుబడుల గురించిన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడచిన తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా డీమ్యాట్‌ ఖాతాల్లో 16 శాతం వృద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఇది 33 శాతంగా ఉందన్నారు. 

Updated Date - 2021-01-20T08:50:59+05:30 IST