Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆన్‌లైన్‌లో ఫోన్ కొంటే అది హీటెక్కింది...రూ. 743 కోట్ల నష్టపరిహారానికి డిమాండ్... ఇంతలో ఊహించని షాక్!

ఒక పెద్ద ఈ కామర్స్ కంపెనీ నుంచి ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోను కొనుగోలు చేశాడు. అయితే కొద్దిరోజుల తరువాత ఆ మొబైల్ ఫోను వేడెక్కసాగింది. దీంతో ఆ వ్యక్తి సదరు ఫోను కంపెనీ గురించి దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. అలాగే సదరు కంపెనీపై వినియోగదారుల ఫోరంలో కంపెనీపై రూ.743 కోట్ల మేరకు నష్టపరిహారం కోరుతూ దావా వేశాడు. అయితే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఈ కేసులో నష్టపరిహారం కోసం దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేసింది. 

ఢిల్లీకి చెందిన వినియోగదారుడు 2016, ఫిబ్రవరి 23న ఒక కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఒక మొబైల్ ఫోను కొనుగోలు చేశాడు. అయితే కొద్దిరోజుల తరువాత నుంచి ఆ ఫోను వేడెక్కసాగింది. దీంతో అతను ఆ ఫోనును కంపెనీకి రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఫోన్ ఆర్డర్ చేయడానికి 16 రోజుల ముందుగానే కంపెనీ తన రిటర్న్ పాలసీని మార్చినట్లు ఫిర్యాదుదారుకు తెలియజేసింది. ఇటువంటి సందర్భంలో అతను ఫోన్ రీప్లేస్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు. అంతేగానీ అతనికి తిరిగి డబ్బును కంపెనీ ఇవ్వదని తెలియజేసింది.

ఈ నేపధ్యంలో మొబైల్ కొనుగోలు చేసిన వ్యక్తి సదరు కంపెనీపై పలు ఆరోపణలు చేస్తూ. వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. చలాన్ బిల్లులో ఫోన్‌ను రీప్లేస్ చేసే ఆప్షన్ తనకు ఇచ్చారని, అది నిబంధనల జాబితాలో కనిపిస్తోందని ఫిర్యాదుదారు తెలిపారు. రిటర్న్ పాలసీ విధానంతో పాటు వాణిజ్య నిబంధనలను తప్పుదోవ పట్టించిన ఈ కంపెనీ గురించి తెలియక లెక్కలేనంతమంది వినియోగదారులు మోసపోయారని ఆయన ఆరోపించారు. తాను కొనుగోలు చేసిన ఫోన్‌కు రూ. 9,119 పరిహారంతో పాటు కోర్టు కేసు ఖర్చులు, రవాణా ఖర్చులకు మొత్తంగా రూ.743 కోట్ల నష్టపరిహారాన్ని ఫిర్యాదుదారు కోరాడు. అలాగే తాను ఈ కంపెనీ వినియోగదారులకు ప్రాతినిధ్యం వహించడానికి కోర్టు అనుమతి కోరాడు. పెద్ద సంఖ్యలో వినియోగదారులను మోసం చేయడానికి, సులభంగా ఆదాయం సంపాదించేందుకు ఆ కంపెనీ ఈ తప్పుదారి పట్టించే ప్రకటనకు రూ.743.9 కోట్లు ఖర్చు చేసిందని, అందుకే ఆ మొత్తాన్ని తనకు నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదుదారు కోరారు.

కోర్టు ఈ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదు విచారణ సందర్భంగా ఎన్సీఆర్డీసీ ఛైర్మన్ జస్టిస్ ఆర్కే అగర్వాల్, సభ్యుడు ఎస్ఎం కాంతికర్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారు కోరినట్లు దీనిని వినియోగదారుల ఉమ్మడి ఫిర్యాదుగా స్వీకరించతగినది కాదని, ఇది కొట్టివేయడానికి అర్హమైన కేసు అని తాము అభిప్రాయపడ్డామని పేర్కొన్నారు. సదరు ఇ-కామర్స్ కంపెనీ తన రిటర్న్ పాలసీలో చేసిన మార్పుల గురించి వార్తాపత్రికలు, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో ప్రచురించిందని కమిషన్ తెలిపింది.

అయితే రిఫండ్‌ విషయంలో... ఫోన్ చలాన్ బిల్లులో కనిపించే ఆప్షన్‌‌లో పాలసీ మారిన తేదీ నుంచి అప్పటికి కేవలం 16 రోజుల గ్యాప్ మాత్రమే ఉందని మేము గ్రహించాం. అందుకే ఫిర్యాదుదారునికి రిఫండ్ ఇవ్వడం సాధ్యంకాదు. అయితే కంపెనీ ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవాలని, అలాంటి చలాన్ బిల్లును మళ్లీ ప్రచురించ కూడదని బెంచ్ ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఆదర్శప్రాయమైన శిక్షా నష్టపరిహారాన్ని అందించడానికి తగిన కేసు కాదని గుర్తించామని బెంచ్ పేర్కొంది. అలాగే తమకు ఆర్థిక అధికార పరిధి లేనప్పుడు ఫిర్యాదు కొనసాగించలేమని, అందుకే దీనిని కొట్టివేస్తున్నామని బెంచ్ తెలియజేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement