మొబైల్ వాడకంతో పెటాకులవుతున్న పెళ్లిళ్లు.. డేంజర్ జోన్‌లో వివాహ బంధం.. ఆ పవిత్ర బంధాన్ని కాపాడుకోవడం ఎలా?

ABN , First Publish Date - 2021-10-10T12:44:32+05:30 IST

ఏడడగులు నుంచి ఏడు జన్మల వరకు సాగాల్సిన వివాహ బంధం ఇప్పుడు నెలలు, రోజులు, నిమిషాల్లోనే విచ్ఛిన్నమవుతోంది. ఇలా ఎందకు జరుగుతోందో.. కారణాలు చెప్పిన విళ్లేషకులు, ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో సూచించారు...

మొబైల్ వాడకంతో పెటాకులవుతున్న పెళ్లిళ్లు.. డేంజర్ జోన్‌లో వివాహ బంధం.. ఆ పవిత్ర బంధాన్ని కాపాడుకోవడం ఎలా?

ఏడడగులు నుంచి ఏడు జన్మల వరకు సాగాల్సిన వివాహ బంధం ఇప్పుడు నెలలు, రోజులు, నిమిషాల్లోనే విచ్ఛిన్నమవుతోంది. ఇలా ఎందకు జరుగుతోందో.. కారణాలు చెప్పిన విళ్లేషకులు, ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో సూచించారు.


ప్రధాన కారణం మొబైల్ ఫోన్ వాడకం

2018లో చేసిన ఒక సర్వే ప్రకారం దాదాపు 17 శాతం పెళ్లిళ్లు మొబైల్ ఫోన్ వాడకం వల్ల పెటాకులయ్యాయని తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న చాలా దంపతులు.. మొబైల్ ఫోన్‌ని తమ బాంధవ్యానికి ఒక ఎలెక్ట్రానిక్ శత్రువుగా వర్ణించారు. కేరళకు చెందిన సైకాలిజిస్ట్ ప్రకారం విడాకుల తీసుకున్న భార్యాభర్తలు.. మొబైల్ ఫోన్ తమ బంధాన్ని పతనం వైపు తీసుకెళుతోందని ఒప్పుకున్నారు. మలయాళంలో బాగా పాపులర్ అయిన ఒక టీవీ షోలో విడాకులు తీసుకున్నవారు పాల్గొన్నారు. తమ వివాహం ఎందుకు విరిగిపోయింది అనే ప్రశ్నకు సమాధానం వారు చెప్పారు. వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని వారు ఒప్పుకున్నారు. వారి వివాహ బంధంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించారని, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రాం, ఆన్‌లైన్ డేటింగ్ చేస్తూ తమ లైఫ్ పార్టనర్‌ని పట్టించుకోలేదని.. అదే వారి విడాకులకు దారితీసిందని చెప్పారు.


పోర్న్ కూడా ఒక ముఖ్య కారణం

దేశంలో విడాకుల కేసుల సంఖ్యను గమనిస్తే ఉత్తర్ ప్రదేశ్ తరువాత కేరళ తరువాత స్థానంలో నిలిచింది. ఈ కేసులలో ఎక్కువగా పోర్న్ వీక్షణం ముఖ్య కారణం. బెంగళూరుకు చెందిన రేవా యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం కేరళ రాష్ట్రంలో పోర్న్ కంటెంట్ ఎక్కువ తయారవుతోంది. పోర్నోగ్రఫీ, డేటింగ్ యాప్స్ వల్ల పురుషులలో సెక్స్ వాంఛ మరింత పెంచుతాయని తెలిసింది. దీని వల్ల వారిలో సెక్స్ కోసం హింసకు పాల్పడే ధోరణి పెరిగిందని సర్వేలో తేలింది. దీని వల్ల భర్తలు తమ భార్యలను ఆ వీడియోలో ఉన్న మహిళలా ఉండాలని కోరుకుంటున్నారని, అది జరగకపోతే వారి మధ్య గొడవలు విడాకుల వరకు వెళుతోందని తేలింది.






కమ్యూనికేషన్ గ్యాప్

మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో విడాకుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ.. అది గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరితోఒకరు సరిగా మాట్లాడుకోకపోవడం వారి మధ్య అపార్థాలకు దారితీస్తోందని చాలా సర్వేలలో వెల్లడైంది. 2019లో విడాకుల తీసుకున్న ఒక టీచర్ తన భర్త తనతో రోజుకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడేవాడని, ఎక్కువగా ఇంట్లో అత్త మామలు, ఆడపడుచులు తమపై పెత్తనం చెలాయించేవారిని చెప్పింది. ఇలా కుటుంబసభ్యుల పెత్తనం వల్ల వీగి పోయిన పెళ్లిళ్లు 8 శాతం ఉన్నాయని సర్వే ద్వారా తెలిసింది.




విడాకులు అవడానికి నిపుణులు చెప్పిన ప్రధాన కారణాలు:

1.భార్యాభర్తలు ఒకరిఒకరు ముభావంగా ఉండడం. ఒకరితోఒకరు సరిగా మాట్లుడుకోకపోవడం. మాట్లాడితే ఒకరిని మరొకరు వెటకారం చేయడం.

2.భార్య లేదా భర్త ఒకరు మరొకరిని మానసికంగా హింసించడం. ఇది తట్లుకోలేని స్థాయికి చేరుకోవడం.

3.ఒకరు మరొకరితో ప్రతి చిన్నదానిపై గొడవపడడం, ఎదుటి వ్యక్తంటే ఇష్టం కోల్పోవడం. ఒకరు కోపంగా మాట్లాడితే మరొకరు ఓర్పుగా ఉండక పోవడం.


పవిత్రమైన వివాహ బంధాన్ని ఇలా కాపాడుకోండి:

1. ఇక తమ వల్ల కాదు. ఈ బంధాన్ని కాపాడుకోవడం ఎలా? అనే పరిస్థితి వచ్చినప్పుడు ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సలర్ సలహాలు తీసుకోవడం.

2.భార్యాభర్తలిద్దరూ ఒకరు మరొకరితో మర్యాదగా ప్రవర్తించడం. ప్రతి చిన్న విషయంపై గొడవపడడం మానుకోవాలి. 

3.పోర్న్ చూసే అలవాటు ఉంటే.. దాన్ని వదలించుకోవడానికి తమ జీవిత భాగస్వామికి విషయం చెప్పి పరిష్కారం చేసుకోవడం లేదా ఒక మ్యారేజ్ కౌన్సిలర్ సలహా తీసుకోవడం.

4.దంపతులలో ఒకరు విడాకులు కోరుకుంటే.. వారి సమస్యలను ఓర్పుతో విని పరిష్కారం కోసం కృషి చేయడం. అలా మాట్లాడుకోకపోతే విడిపోవడం ఖాయం.

5.నిజంగా తమ వివాహ బంధాన్ని కాపాడుకోవాలంటే ముందు తమ తమ తప్పులను ఒప్పుకోవడం. దీని వల్ల మీ జీవిత భాగస్వామికి మీపై మంచి భావన కలుగుతుంది. బంధం ముందుకంటే మెరుగుపడుతుంది.



Updated Date - 2021-10-10T12:44:32+05:30 IST