హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-24T18:55:28+05:30 IST

వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసేలా జీహెచ్‌ఎంసీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌

  • 23 టీంలు ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ : వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసేలా జీహెచ్‌ఎంసీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం 40 కొత్త వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, బుధవారం మొబైల్‌ వ్యాక్సినేషన్‌ సేవలు ప్రారంభించారు. మొదటి రోజు 23 ప్రాంతాల్లో మొబైల్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేశారు. చార్మినార్‌, అంబర్‌పేట, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు పని చేశాయి. నిర్ణీత ఏరియాల్లో ఒక్కో చోట వ్యాక్సిన్‌ వేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఒక్కో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ టీంలో డాక్టర్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం, యూపీహెచ్‌ఎంసీ ఏఎన్‌ఎంలు సభ్యులుగా ఉన్నారు. బార్కస్‌, జంగమ్మెట్‌, అంబర్‌పేట, పానీపురా, గోల్కొండ, నాంపల్లి, అమీర్‌పేట, శ్రీరాంనగర్‌ తదితర ప్రాంతాల్లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ జరిగింది. ఒక్కో మొబైల్‌ సెంటర్‌ ద్వారా నిత్యం 300 మందికి వాక్సిన్‌ వేయనున్నారు.

Updated Date - 2021-06-24T18:55:28+05:30 IST