Abn logo
Aug 4 2020 @ 22:28PM

మోడల్ టౌన్లుగా తాడేపల్లి, మంగళగిరి

అమరావతి: తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేందుకు గానూ సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసేందుకు పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. ఈ రెండు పట్టణాలను రూ. 1173 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలు ఏపీయూఐఏఎంల్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement
Advertisement