ఆసుపత్రులకు ఆధునిక నేత్ర వైద్య పరికరాలు

ABN , First Publish Date - 2021-01-17T06:03:33+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లోని కంటి విభాగాలకు ఆధునిక పరికరాలను అందజేసినట్టు జాతీయ అంధత్వ నివారణ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరసింగరావు చెప్పారు.

ఆసుపత్రులకు ఆధునిక నేత్ర వైద్య పరికరాలు
వైద్యాలయంలో కంటి పరీక్షలను పరిశీలిస్తున్న జేడీ

జాతీయ అంధత్వ నివారణ విభాగం జేడీ డాక్టర్‌ నరసింగరావు


అనకాపల్లి టౌన్‌, జనవరి 16: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లోని కంటి విభాగాలకు ఆధునిక పరికరాలను అందజేసినట్టు జాతీయ అంధత్వ నివారణ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరసింగరావు చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని కంటి పరీక్షల విభాగం, ఆపరేషన్‌ థియేటర్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కో ఆస్పత్రికి రూ.కోటి విలువ చేసే ఆధునిక పరికరాలు వచ్చాయన్నారు. ఎన్టీఆర్‌ వైద్యాలయానికి మరిన్ని ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మైక్రోస్కోప్‌ విధానం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట కంటి వైద్యురాలు లావణ్య, స్టాఫ్‌నర్సు నర్సమ్మ ఉన్నారు.


Updated Date - 2021-01-17T06:03:33+05:30 IST