మోడ్రన్‌ ట్విస్ట్‌

ABN , First Publish Date - 2021-07-21T05:40:31+05:30 IST

సంప్రదాయానికి ఆధునిక హంగులద్ది సరికొత్త అవుట్‌ఫిట్‌కు రూపం ఇచ్చింది ఆరోహి షా. ఎవరీ షా అంటారా? ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ విద్యార్థిని.

మోడ్రన్‌ ట్విస్ట్‌

సంప్రదాయానికి ఆధునిక హంగులద్ది సరికొత్త అవుట్‌ఫిట్‌కు రూపం ఇచ్చింది ఆరోహి షా. ఎవరీ షా అంటారా? ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ విద్యార్థిని. చేనేత చీరలకు కళాత్మకతను జోడించి ‘ఆరోహి ఎక్స్‌ ఎకయా ఎస్‌ఎస్‌ 21’ పేరుతో ఓ కలెక్షన్‌ తీసుకువచ్చింది. చిక్‌ సూట్స్‌, బయాస్‌ కట్‌ స్కర్ట్స్‌, మోడ్రన్‌ శారీస్‌ వంటి కలర్‌ఫుల్‌ డ్రెస్సులెన్నో ఇందులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా విభిన్న టెక్స్‌టైల్స్‌ని మిళితం చేసి ఈ కలెక్షన్‌ రూపొందించింది ఆరోహి. సౌకర్యంతో పాటు ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. రెడీ టు వేర్‌ కాన్సెప్ట్‌తో కుట్టిన యూత్‌ఫుల్‌ డిజైన్లు చూపు తిప్పుకోనివ్వవు. ధర ఎంతో తెలుసా..? పదిహేను వేల రూపాయలతో మొదలవుతుంది.

Updated Date - 2021-07-21T05:40:31+05:30 IST