నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-03T10:10:53+05:30 IST

జగిత్యాల జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మంగళవారం వాడవాడలా నిరాడంబరంగా జరిగా యి. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌

నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు

కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగుర వేసిన సంక్షేమ శాఖ మంత్రి

తెలంగాణ తల్లి విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి నివాళులు

హాజరైన జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆర్థిక సంఘం చైర్మెన్‌


జగిత్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మంగళవారం వాడవాడలా నిరాడంబరంగా జరిగా యి. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహా నికి, అమర వీరుల స్థూపానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మంత్రి ఈశ్వర్‌  మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు.  కరోనా వైరస్‌ నేపధ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గొప్పగా జరుపుకోలేక పోయామని వివరించారు.


జిల్లా అధికారులతో కలిసి తేనేటి విందులో  పాల్గొన్నారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆర్థి క సంఘం చైర్మెన్‌ రాజేశంగౌడ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బల్దియా చైర్‌ పర్సన్‌ శ్రావణి, జిల్లా కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్‌ రాజేశం, డీఆర్‌వో అరుణ శ్రీ, ఆర్డీవో నరేందర్‌ తదితరుల పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T10:10:53+05:30 IST