నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T06:05:12+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 73వ గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

- వాడవాడనా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

పెద్దపల్లి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 73వ గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అంతకుముందు ఆమె పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి, మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులు, సిబ్బందికి అందరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఆహర్షిశలు కృషి చేస్తానన్నారు. ఈ వేడుకలకు హాజరైన పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్‌ రెడ్డి జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, డీసీపీ రవీందర్‌, ఏసీపీ సారంగపాణి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ ఏవో కెవై ప్రసాద్‌, సూపరింటెండెంట్లు తూము రవీందర్‌, అనుపమరావు, నారాయణ, దత్తుప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

- జిల్లా కార్యాలయాల్లో..

జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సీఈవో శ్రీనివాస్‌, డీఈవో కార్యాలయంలో డీఈవో మాధవి, వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, గనులు, భూగర్భ శాఖ కార్యాలయంలో ఏడీ సాయినాథ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో డీఆర్‌డీవో శ్రీధర్‌, సీపీవో కార్యాలయంలో ఇన్‌చార్జీ సీపీవో రవీందర్‌, డీఎస్‌వో కార్యాలయంలో డీఎస్‌వో తోట వెంకటేశ్‌, పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో డీఎం ప్రవీణ్‌ కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌లో ఈడీ రాజేశ్వరీ, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆవరణలో జిల్లా అధికారి నాగైలేశ్వర్‌, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీఏవో తిరుమల్‌ప్రసాద్‌, జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డాక్టర్‌ మందల వాసుదేవరెడ్డి, డీపీఆర్‌వో కార్యాలయంలో డీపీఆర్‌వో సలీం అహ్మద్‌, వివిధ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ పతాకాలను ఎగుర వేశారు.


Updated Date - 2022-01-27T06:05:12+05:30 IST