నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T06:28:42+05:30 IST

మదినిండా దేశభక్తి.. ఉప్పొంగే ఉత్సాహం ఉన్నా జిల్లాలో గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల మేరకు పరేడ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.

నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు
కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు

- కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- సాంస్కృతిక వేడుకలకు దూరం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మదినిండా దేశభక్తి.. ఉప్పొంగే ఉత్సాహం ఉన్నా  జిల్లాలో గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల మేరకు పరేడ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌ సముదాయంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్యతోపాటు ఆర్డీవోలు టి.శ్రీనివాసరావు, వి.లీల, జిల్లా అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. 

ఫ జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. జిల్లా జడ్జి ఎం.జాన్సన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, పీపీ నర్సింగరావు, ఏజీపీ రవీందర్‌రావు, సంజీవరెడ్డి, ఏపీపీ సందీప్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షడు వసంతం, కార్యదర్శి శ్రీనివాస్‌, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌ పాల్గొన్నారు. 

ఫ జిల్లా పోలీస్‌ కార్యాలయం, తాడూర్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌, 17వ పోలీస్‌ బెటాలియన్‌ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఎస్పీ రాహుల్‌హెగ్డే జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌   విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు. ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరూ విఽధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితంగా స్వాతంత్య్రం సాధించుకున్నామని, గణతంత్ర దినోత్సవం రోజున  సర్మించుకుంటున్నామని అన్నారు. నీతి, నిజాయితీ, పారదర్శకతతో ధనిక, పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూస్తూ పనిచేయాలన్నారు. ఎందరో వీరజవాన్లు ఉగ్రవాదులు, విద్రోహ శక్తులతో పోరాడి ప్రాణాలు త్యాగం చేశారన్నారు. తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అత్యున్నత అధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నా పోలీస్‌ వ్యవస్థగా పేరు పొందిందన్నారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌ ఉన్నారు. 

ఫ 17వ పోలీస్‌ బెటాలియన్‌ వద్ద కమాండెంట్‌ సుబ్రమ్మణ్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్‌, బాబు రాజేందప్రసాద్‌ వంటివారు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కృపాకర్‌, ఏవో శైలజ పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంలో జడ్పీ ఆవరణలో డిప్యూటీ సీఈవో గీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జడ్పీటీసీలు కొమిరిశెట్టి విజయ, కళావతి, కో ఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా జాతీయ పతాకానికి వందనం చేశారు. సిరిసిల్ల గాంధీచౌక్‌ వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య జాతీయ పతాకాలను అవిష్కరించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

ఫ జిల్లా గ్రంథాలయ  సంస్థ కార్యాలయం వద్ద  చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, అర్బన్‌ బ్యాంక్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అధ్యక్షడు గాజుల నారాయణ, సెస్‌ కార్యాలయంలో ఎండీ రామకృష్ణ, వెలమ సంక్షేమ మండలి కార్యాలయం వద్ద అధ్యక్షుడు చిక్కాల రామారావు, పాలిస్టర్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద అధ్యక్షుడు మండల సత్యం, చేనేత వస్త్ర వ్యాపార సంఘం వద్ద అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం వద్ద అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలి భవనం వద్ద అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, వీరబద్రీయుల సంఘం వద్ద అజారీ మార్కండేయ, జిల్లా అధ్యక్షుడు  పొన్నాల శివకుమార్‌ జాతీయ పతాకాలను ఎగురవేశారు. 

ఫ సిరిసిల్ల టౌన్‌ : భారత గణతంత్ర దినోత్సవం వేడుకలను బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు.  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి,  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ఆయా పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండా  ఎగురవేశారు. గాంధీచౌక్‌ వద్ద  కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, టీటీడీపీ పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్‌గౌడ్‌ ఆయా పార్టీల కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరించారు.  స్థానిక చేనేత విగ్రహం వద్ద సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్‌ మోర శ్రీనివాస్‌, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జూపల్లి నాగేందర్‌రావు, సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌ ఎదుట అధ్యక్షుడు పాలమాకుల శేఖర్‌, టౌన్‌క్లబ్‌ ఆవరణలో అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.  

ఫ సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు, కరస్పాంటెంట్‌లు జాతీయ జెండాలు ఎగురవేశారు.  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

ఫ ఏబీవీపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సాయిశ్రీ జూనియర్‌ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మొక్కలను నాటారు.  రాష్ట్ర హాస్టల్స్‌ కో కన్వీనర్‌ మారవేణి రంజిత్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌ లోపెల్లి రాజు, జాయింట్‌ సెక్రెటరీ కాసారపు నితిన్‌, సందీపని, కొక్కుల ఆనంద్‌ పాల్గొన్నారు. 

ఫ సిరిసిల్ల రూరల్‌ :  సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్దాపూర్‌, రగుడు, చంద్రంపేట, పెద్దూర్‌, ముష్టిపెల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల గ్రామాల్లో వార్డు కార్యాలయాల్లో కౌన్సిలర్లు పోచవేని సత్య, పాతూరి రాజిరెడ్డి, బోల్గం నాగరాజుగౌడ్‌, కల్లూరిలత, చెన్నమనేని కీర్తి, లింగంపల్లి సత్యనారాయణ, యువజన సంఘాలు, అంబేద్కర్‌ సంఘాల వద్ద నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు.  సర్ధాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, చంద్రంపేటలోని జిల్లా రైతు వేదిక ఎదుట రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పెద్దూర్‌ సింగిల్‌ విండోలో చైర్‌పర్సన్‌ బర్కం వెంకటలక్ష్మీ, పెద్దూర్‌లోని విజయ డెయిరీ ఎదుట చైర్మన్‌ తాళ్లపల్లి  భాస్కర్‌గౌడ్‌ ,  పెద్దూర్‌ యాదవ సంఘంలో అధ్యక్షుడు పంచాగం ఎల్లయ్యయాదవ్‌  జెండా ఆవిష్కరించారు.   బీజేపీ పట్టణ కార్యాలయం ఎదుట అఽధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, బీవైనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం ఎదుట వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం. గణేష్‌నగర్‌లో ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోరండ్ల రమేష్‌ జాతీయ జెండా ఎగురవేశారు. 

Updated Date - 2022-01-27T06:28:42+05:30 IST