మిడతల కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుంది : మోదీ భరోసా

ABN , First Publish Date - 2020-05-31T18:50:29+05:30 IST

మిడతల కారణంగా పంటలు దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం పూర్తి అండగా ఉండి, సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా

మిడతల కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుంది : మోదీ భరోసా

న్యూఢిల్లీ : మిడతల కారణంగా పంటలు దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం పూర్తి అండగా ఉండి, సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా కల్పించారు. ఈ విషయాన్ని ‘మన్ కీ బాత్’ లో ఆయన వెల్లడించారు. ‘‘దేశంలోని చాలా ప్రాంతాలు మిడతల దాడికి గురయ్యాయి. చిన్న కీటకాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయన్నది ఈ దాడులు మనకు బోధపడేలా చేశాయి. చాలా ప్రాంతాలు మిడతల దాడులకు ప్రభావితమయ్యాయి’’ అని తెలిపారు.


కొత్త కొత్త అన్వేషణలతో దీనిని ఎదుర్కోవాలని, వ్యవసాయ రంగం త్వరలోనే దీనిని అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నుండి మిడతల సమూహాలు రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాయి, పత్తి పంటలు మరియు కూరగాయలకు పెద్ద నష్టం వాటిల్లింది. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ కొద్దో గొప్పో ప్రభావితమైనా.. రాజస్థాన్ మాత్రం ఎక్కువగా ప్రభావితమైంది. 

Updated Date - 2020-05-31T18:50:29+05:30 IST