ఉద్ధవ్ ఠాక్రే సలహాతో ఏకీభవించి, ఆచరణలో పెట్టిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-04-03T00:07:01+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్

ఉద్ధవ్ ఠాక్రే సలహాతో ఏకీభవించి, ఆచరణలో పెట్టిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సలహాలను కూడా స్వీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీకి ఓ సలహా ఇచ్చారు. ఆ సలహాతో ప్రధాని మోదీ వందశాతం ఏకీభవించారు.


ఆ సలహా ఏమంటే... మత పెద్దలు ఎలాంటి మత సమావేశాలు నిర్వహించకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్ధవ్ సలహా ఇచ్చారు. దీంతో మోదీ ఏకీభవించారు. ఏకీభవించడమే కాకుండా అందరు మత పెద్దలతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాలని, భారీ సంఖ్యలో ఒకే చోట గుమిగూడకుండా చూసే బాధ్యతతో పాటు సామాజిక దూరం పాటించేలా మత పెద్దలు చూడాలని ముఖ్యమంత్రులు కోరాలని ప్రధాని మోదీ సూచించినట్లు ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2020-04-03T00:07:01+05:30 IST