టైం మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న మోదీ, మమత

ABN , First Publish Date - 2021-09-16T22:17:31+05:30 IST

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ కలిసున్న ఫొటో ఫీచర్‌తో ఈ మ్యాగజైన్ కవర్ పేజీ సిద్ధమైంది. కాగా, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు ముగ్గురే అని.. దేశ మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయిలో దేశంలో శక్తివంతంగా ఎదిగిన నేత నరేంద్రమోదీయేనని టైంలో రాసుకొచ్చారు.

టైం మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న మోదీ, మమత

న్యూఢిల్లీ: 2021 ఏడాదికి సంబంధించి ప్రఖ్యాత ‘టైం మ్యాగజైన్‌’ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా చోటు దక్కించుకున్నారు. బుధవారం ‘‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులై 100 మంది’’ అనే పేరుతో టైం మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్, ఉపాధ్యక్షులు కమలా హారిస్, చైనా అధినేత జీ జిన్‌పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ లాంటి ప్రముఖులతో పాటు తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం.


ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ కలిసున్న ఫొటో ఫీచర్‌తో ఈ మ్యాగజైన్ కవర్ పేజీ సిద్ధమైంది. కాగా, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు ముగ్గురే అని.. దేశ మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయిలో దేశంలో శక్తివంతంగా ఎదిగిన నేత నరేంద్రమోదీయేనని టైంలో రాసుకొచ్చారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒక విమర్శ రాసుకొచ్చారు. ‘‘దేశాన్ని లౌకికత్వం నుంచి హిందుత్వ జాతీయవాదంలోకి తీసుకెళ్తున్నారు’’ అని సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రాసుకొచ్చారు. ఇండియాలో ముస్లిం మైనారిటీల హక్కులు కాలరాస్తున్నారని, జర్నలిస్ట్‌లను నిర్భందిస్తున్నారని విమర్శించారు.


ఇక మమతా బెనర్జీ గురించి ‘‘బెరుకులేని రాజకీయ నేతకు ఆమె నిదర్శనం’’ అంటూ ప్రశంసలు గుప్పించారు. ‘‘ఆమె పార్టీని నడిపించడం లేదని, ఆమెనే పార్టీ అని’’ విమర్శ కూడా చేశారు.

Updated Date - 2021-09-16T22:17:31+05:30 IST