Modi-Stalin meet: కొన్ని హామీలు, కొన్ని డిమాండ్లు

ABN , First Publish Date - 2021-06-18T00:05:21+05:30 IST

స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ భేటీ సంతృప్తికరంగా జరిగిందని చెప్పారు. తన అభ్యర్థనలకు ప్రధాని ఇచ్చారని చెబుతూనే కొన్ని డిమాండ్లను లేవనెత్తిన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం ఉదయం వీరి భేటీ జరిగింది.

Modi-Stalin meet: కొన్ని హామీలు, కొన్ని డిమాండ్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ భేటీ సంతృప్తికరంగా జరిగిందని చెప్పారు. తన అభ్యర్థనలకు ప్రధాని ఇచ్చారని చెబుతూనే కొన్ని డిమాండ్లను లేవనెత్తిన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం ఉదయం వీరి భేటీ జరిగింది.


‘‘ప్రధాని మోదీతో జరిగిన సమావేశం చాలా సంతృప్తికరంగా సాగింది. రాష్ట్రాభివృద్ధికి తమ సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే తమిళనాడులోని సమస్యల పరిష్కారం కోసం తనను ఎప్పుడైనా కలిసేందుకు, ఫోన్ చేసేందుకు సిద్ధమని మోదీ హామీ ఇచ్చారు’’ అని స్టాలిన్ అన్నారు. అయితే ఈ విషయం చెబుతూనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా మోదీకి స్టాలిన్ విజ్ణప్తి చేశారు. ‘‘నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, నీట్‌, నూతన విద్యా విధానాలను రద్దు చేయడంతో పాటు చెంగల్పట్టు వ్యాక్సీన్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించడం, సేతు సముద్రం ప్రాజెక్ట్ పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో లేవనెత్తాను’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T00:05:21+05:30 IST