Abn logo
Sep 23 2021 @ 10:31AM

అమెరికా చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లో ప్రధాని మోదీని ఇండియన్-అమెరికన్లు ఘనంగా స్వాగతించారు. ప్రధాని పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు పేర్కొన్నారు. 

ఈ రోజు వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆమెతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించనున్నారు.

తాజా వార్తలుమరిన్ని...