బంధాలు సుదృఢం చేసుకోవడానికి సమయమిదే : ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్ర మోదీ

ABN , First Publish Date - 2020-06-04T17:28:30+05:30 IST

భారత్ - ఆస్ట్రేలియా మధ్య విలువలతో కూడిన సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న

బంధాలు సుదృఢం చేసుకోవడానికి సమయమిదే : ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : భారత్ - ఆస్ట్రేలియా మధ్య విలువలతో కూడిన సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న విలువల కారణంగా బంధాలు పటిష్టంగానే ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిరువురూ చర్చించుకున్నారు. ద్వైపాక్షిక చర్చలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించేందుకు అంగీకారం తెలిపినందుకు మోదీ ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

అయితే ప్రత్యక్ష చర్చలతో పోలిస్తే... ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నడిచే చర్చలు ఏమాత్రం భర్తీ చేయలేవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలలు మరింత సుదృఢం చేసుకోడానికి సమయం ఆసన్నమైందని, మరింత దృఢం చేసుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ‘‘మనం స్నేహాన్ని మరింత పటిష్టం చేసుకోడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి కావాల్సిన స్థిరత్వం మన సంబంధాల ద్వారా వెల్లివిరిసే అవకాశం ఉంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.


కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ ఈ సందర్భంగా నివాళులర్పించారు. కోవిడ్‌ కాలంలో... మహమ్మారిని తట్టుకోడానికి చాలా ప్రయత్నాలే చేశామని, ఇంతటి విపత్కర పరిస్థితిని అవకాశంగా మలుచుకోడానికి చాలా నిర్ణయాలు తీసుకున్నామని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. భారత్‌లో సమగ్ర సంస్కరణలు అన్ని మూలలా ప్రారంభమయ్యాయని, కొన్ని రోజుల్లోనే వాటి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ మాట్లాడుతూ.... ఇండో పసిఫిక్ రీజియన్‌లో పరస్పరం కలిసి పనిచేద్దామని మోదీకి స్నేహ హస్తం చాచారు. ఇరు దేశాల మధ్య సానుకూల సంబంధాలే ఉన్నాయని, ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక ఒప్పందాలు జరగడం ఆనందదాయకమని మోరిసన్ హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-04T17:28:30+05:30 IST