Abn logo
Sep 10 2021 @ 19:14PM

కొవిడ్‌పై ప్రధాని కీలక సమావేశం

న్యూఢిల్లీ: కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేరళ, మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంపై మోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో రికవరీ రేట్ 97.49% ఉండటాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 72 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారిలో 50% మంది ఫస్ట్ డోస్, 18% మంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని వివరించారు. 12 సంవత్సరాలు పైబడిన వారికి ఈ నెల 15నుంచి జైకోవ్ డీ వ్యాక్సిన్లు వేయనుండటంతో ఏర్పాట్లను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు.