మోదీ ఫిట్‌నెస్‌ రహస్యం.. పసుపు

ABN , First Publish Date - 2020-09-25T07:05:42+05:30 IST

ఫిట్‌నెస్‌, ఆరోగ్యం గురించి అమిత శ్రద్ధ తీసుకునే ప్రధాని మోదీ తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు...

మోదీ ఫిట్‌నెస్‌ రహస్యం.. పసుపు

  • అమ్మ అడిగే విషయాన్ని చెప్పిన ప్రధాని
  • ఫిట్‌గా ఉండడం కష్టమేం కాదు
  • క్రమశిక్షణ ఉంటే చాలని వ్యాఖ్య


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఫిట్‌నెస్‌, ఆరోగ్యం గురించి అమిత శ్రద్ధ తీసుకునే ప్రధాని మోదీ తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.‘‘మా అమ్మ వారానికి 2 రోజులు నాకు ఫోన్‌ చేస్తుంది. యోగక్షేమాలు వాకబు చేస్తుంది. ప్రతిసారి ఆమె తప్పనిసరిగా అడిగేది ఒకటే.. ఆహారంలో పసుపు ఉండేట్లు చూసుకుంటున్నావా? తగు సంఖ్యలో పసుపు తీసుకుంటున్నావా? అని! నేను అవునని బదులిస్తాను. పసుపు యాంటీ బయాటిక్‌. ఎంతో మంచిది. ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను’’ అని ప్రధాని వెల్లడించారు. ఫిట్‌ ఇండియా కార్యాచరణ మొద లై ఏడాదైన సందర్భంగా ఆయన అనేక మంది ఫిట్‌నెస్‌ నిపుణులు, క్రీడాకారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ‘ఫిట్‌నె్‌సకీ డోస్‌.. ఆధా గంటా రోజ్‌’’ అనే నినాదాన్ని ప్రధాని ఈ సందర్భంగా వినిపించారు. క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, జమ్మూ కశ్మీర్‌కు చెం దిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అఫ్‌షాన్‌ ఆషిక్‌, పారాఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత దేవేంద్ర ఝజారియా, న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివాకర్‌ మొదలైన వారితో ఫిట్‌నెస్‌ చర్చ లో పాల్గొన్నారు. ‘‘చాలా మంది అనుకుంటున్నట్లుగా ఫిట్‌నె్‌స కష్టమేంకాదు. కావాల్సిందల్లా కాస్తంత క్రమశిక్షణ. ఆరోగ్యకర ఆహారం మన జీవితంలో అంతర్భాగం కావాలి’’ అని ప్రధాని అన్నారు.


‘‘మీ వయసు 55 ఏళ్లు అం టున్నారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఎలా ఉం డగలుగుతున్నారు? మీ ఫిట్‌నెస్‌ రహస్యమేంటి?’’ అని ఒకప్పటి సూపర్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ను ప్రధాని ప్రశ్నించారు. ‘‘నన్ను చాలా మంది అడుగుతుంటారు. మీ వయస్సు 55 ఏళ్లా? ఇప్పటికీ 500కిలోమీటర్ల దూరం ఎలా పరిగెత్తగలుగుతున్నారు? అని ఆశ్చర్యంగా అడుగుతారు. నేను వారికిచ్చే సమాధానం ఒకటే.. మా అమ్మ వయసు 81ఏళ్లు. ఇప్పటికీ ఎలాబస్కీలు తీస్తుందో మీరు వీడియోలో చూసే ఉంటారు. అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె వయసు వచ్చే వేళకి నేను కూడా ఆమెలానే ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సోమన్‌.. మోదీకి బదులిచ్చారు. ‘‘పాత తరానికి చెందిన వారు రోజుకి 50 కిలోమీర్ల దూరం నడిచేవారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఇప్పటికీ మంచినీళ్ల కోసం, ఇతర అవసరాల కోసం 50 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. నా దృష్టిలో రోజుకి 100 కిమీ దూరం పోవడం పెద్ద కష్టం కాదు. పల్లెల్లో ప్రజలు ఫిట్‌గానే ఉంటారు. పట్టణాల్లోనే ఈ జాడ్యం. అదే పనిగా ఎవరూ ఇంట్లో కూర్చొని చలనం లేకుండా ఉండరాదు’’ అని సోమన్‌ వివరించారు. ‘‘ఫిట్‌నెస్‌ కోసం ఎవరూ జిమ్‌లకు వెళ్లక్కరలేదు. అదే పనిగా అదీ ఇదీ తాగక్కరలేదు. కావాల్సినదల్లా మానసిక బలం’’ అని ఆయన వివరించారు.


ప్రధానిగా ఉంటూ ఒత్తిళ్లను ఎలా తట్టుకుంటున్నారు ... అని సోమన్‌ మోదీని అడిగారు. ‘‘ఎలాంటి ఆశా లేకుండా ఇతరులకు బాధ్యతతో సేవ చేస్తున్నప్పు డు అసలు ఒత్తిడే ఉండదు. పైపెచ్చు శక్తి కూడా లభిస్తుంది. దీనికి తోడు ప్రతిస్ఫర్థ (పోటీతత్వం) వల్ల కూడా ఒత్తిడిని జయించవచ్చు’’ అని మోదీ బదులిచ్చారు.


మోదీపై పాటకు ప్రశంసలు

ప్రధాని మోదీని కొనియాడుతూ 15 ఏళ్ల భారతీయ అమ్మాయి పాడిన పాటకు యూఏఈలో ప్రశంసల వర్షం కురిసింది. మోదీ 70వ పుట్టిన రోజును పురస్కరించుకుని సుచేత సతీశ్‌ అనే టెన్త్‌ గ్రేడ్‌ విద్యార్థి ‘‘నమో నమో విశ్వగురు భారత్‌’’ పేరుతో పాడిన పాట డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజై వైరల్‌ అయింది.

Updated Date - 2020-09-25T07:05:42+05:30 IST