కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు మోదీ సందేశం

ABN , First Publish Date - 2020-09-24T02:09:48+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు సమగ్ర పరీక్షలు, జాడ కనుగొనడం, చికిత్స చేయడం, నిఘా పెట్టడంపై దృష్టి సారించాలని

కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు మోదీ సందేశం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు సమగ్ర పరీక్షలు, జాడ కనుగొనడం, చికిత్స చేయడం, నిఘా పెట్టడంపై దృష్టి సారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో కోవిడ్-19 కేసులు అధికంగా ఉన్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 


కోవిడ్-19 పరీక్షలపై వదంతులను పారదోలేందుకు స్పష్టమైన సందేశం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. కోవిడ్-19 సోకినవారిలో చాలా మందికి ఆ వ్యాధి సంబంధిత లక్షణాలు కనిపించడం లేదని, అందువల్ల సమగ్రమైన సందేశాలను ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో టెస్టింగ్‌పై వదంతులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పరీక్షలు చేయించడం మంచిది కాదనే విధంగా ప్రజల మనసుల్లో సందేహాలు ఉత్పన్నం కావచ్చునని తెలిపారు. ఇన్ఫెక్షన్ తీవ్రతను కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని, ఇది చాలా తప్పు అని తెలిపారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశంలో నమోదైన కోవిడ్ యాక్టివ్ కేసుల్లో 63 శాతానికి పైగా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


భారత దేశంలో 56 లక్షలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 90 వేల మందికి పైగా ఈ వ్యాధిగ్రస్థులు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-24T02:09:48+05:30 IST