‘టైం’ ప్రతిభావంతుల జాబితాలో మోదీ... కానీ...

ABN , First Publish Date - 2020-09-24T02:35:33+05:30 IST

‘టైం-100’ ప్రతిభావంతుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్థానం దక్కింది. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోన్న అత్యంత ప్రతిభావంతుల్లో తొలి వంద మందిలో ఆయన ఈ స్థానాన్ని సంపాదించారు. కాగా మోదీతోపాటు మరో అయిదుగురు భారతీయులకు స్థానం లభించడం విశేషం.

‘టైం’ ప్రతిభావంతుల జాబితాలో మోదీ... కానీ...

లండన్ : ‘టైం-100’ ప్రతిభావంతుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్థానం దక్కింది. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోన్న అత్యంత ప్రతిభావంతుల్లో తొలి వంద మందిలో ఆయన ఈ స్థానాన్ని సంపాదించారు. కాగా మోదీతోపాటు మరో అయిదుగురు భారతీయులకు స్థానం లభించడం విశేషం.


ఇక ఆ జాబితాలో చోటు దక్కిన భారతీయులు... నరేంద్ర మోదీ, షాహీన్‌బాగ్ బిల్కిస్ బానో, ఆయుష్మాన్ ఖురానా. మోదీ సహా ఐదుగురు భారతీయులతో కూడిన 2020 సంవత్సరపు అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది.


గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు ఆయుష్మాన్ ఖురానా, హెచ్ఐవీ పరిశోధకులు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా, షహీన్ భాగ్ నిరసనల్లో పాల్గొన్న 82 ఏళ్ల బిల్కిస్ బానో కూడా ఈ జాబితాలో ఉన్నారు.


ఇదిలా ఉంటే... ప్రధాని మోదీని ఈ జాబితాలో చేరుస్తున్నట్లుగా ప్రకటిస్తూ ‘టైమ్‌’లో రాసిన సంక్షిప్త కథనంలో ఆయన గురించి కటువుగానే రాయడం గమనార్హం. 

Updated Date - 2020-09-24T02:35:33+05:30 IST